వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్ట్‌ల మధ్య భీకర కాల్పులు: 15మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Maoists
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని ఛాత్రా జిల్లా లకర్‌బాంద గ్రామంలో పదిహేను మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మావోయిస్టులు, పోలీసుల కాల్పుల్లోనే వీరు చనిపోయారని, మావోయిస్టులోని ఇరువర్గాల మధ్య ఘర్షణ కారణంగా చనిపోయారని వార్తలు వస్తున్నాయి. అయితే, మావోయిస్టుల మధ్య గొడవ వల్లనే చనిపోయినట్లుగా ప్రధానంగా భావిస్తున్నారు.

ఒరిస్సా - జార్ఖండ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. మావోయిస్టు నేత అరవింద్ సహా పదిహేను మంది మృతదేహాలు లభించాయి. మృతుల్లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

మావోయిస్టులు, సిఆర్‌పిఎఫ్ వర్గాల మధ్య కాల్పులు జరిగాయని భావిస్తున్నప్పటికీ అలాంటి ఛాయలు కనిపించడం లేదంటున్నారు. మావోయిస్టుల్లోని రెండు వర్గాల మధ్య జరిగిన భీకర పోరులోనే వీరు హతమైనట్లుగా భావిస్తున్నారు. సిపిఐ(మావోయిస్ట్), ట్రిటియా ప్రస్తితు కమిటీ(టిపిసి) వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది.

గతంలో పోలీసు బలగాల నుంచి దొంగిలించిన పలు ఆయుధాలను సంఘటన స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గురువారం ఉదయం మృతదేహాలను గుర్తించారు. టెన్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, ఎకె 47, కార్బైన్‌లతో పాటు ఇతర పేలుడు పదార్థాలన పోలీసులు గుర్తించారు.

English summary
In a clash between the CPI(Maoists) and Tritioya Prastitui Committee(TPC) — a splinter group of Naxalites — at Lakarbandha village in Chatra district, 15 top Maoists, including their area, zonal, platoon commanders were killed. One central area committee member too was killed in the fierce fighting which continued till wee hours of Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X