వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలాలా జీవిత చరిత్ర పుస్తకానికి రూ.16 కోట్ల ఒప్పందం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Malala Yousafzai
లండన్: తాలిబన్ల దాడిలో గాయపడి ఇటీవలే పాఠశాలకు వెళుతోన్న పాకిస్తాన్ అమ్మాయి మలాలా యూసఫ్ జాయ్ తన జ్ఞాపకాలను పుస్తక రూపంలోకి తీసుకురానుంది. ప్రస్తుతం మలాలా వయస్సు పదిహేనేళ్లు. ఈ చిన్నారి తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలన్నింటిని గ్రంధస్థం చేయనుంది. 'ఐయామ్ మలాలా'(నేను మలాలా) అన్న పేరుతో ఆమె ఈ పుస్తకాన్ని రాయనుంది.

ఆమె రాసే పుస్తకాన్ని ప్రచురించడానికి ప్రముఖ ప్రచురణకర్తలు ఎందరో ముందుకు వచ్చారు. ఈ పుస్తకం కోసం మలాలాతో ప్రచురణకర్తలు దాదాపు పదహారు కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారు. బాలల విద్యా హక్కుల కోసం పోరాడి తాలిబన్ల చేతిలో గాయపడి కోలుకొని ఇటీవలే పాఠశాలకు వెళ్తున్న మలాలా జీవిత చరిత్రను రూ.16 కోట్లకు ప్రచురణకర్తలు ఒప్పందం కుదుర్చుకున్నారని యూకెకు చెందిన గార్డియన్ పేర్కొంది.

ఈ పుస్తకాన్ని యుకె, కామన్వెల్త్ దేశాల్లో వెయిడెన్‌ఫెల్డ్ అండ్ నికోల్సన్, మిగిలిన దేశాల్లో లిటిల్, బ్రౌన్ ప్రచురణ సంస్థలు విడుదల చేయనున్నాయి. తాను తన జీవిత కథను చెప్పదల్చుకున్నానని, ఇది కేవలం తన గాథ మాత్రమే కాదని, 61 మిలియన్ చిన్నారుల జీవిత కథ అని చెప్పింది.

ప్రతి అమ్మాయి, అబ్బాయి పాఠశాలకు వెళ్లాలని తాను భావిస్తున్నానని, ఇందుకు సంబంధించిన ప్రచారంలో తాను పాల్గొంటానని, చదవడం ప్రతి ఒక్కరి హక్కు అని ఆమె చెప్పారు. తాను రాసే పుస్తకం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి చేరుతుందని, తద్వారా పిల్లల చదువు యొక్క ప్రాధాన్యతను తెలుసుకుంటారని తాను భావిస్తున్నానని ఆమె చెప్పింది.

English summary

 Malala Yousafzai, the Pakistani schoolgirl shot in the head at point-blank range by Taliban for advocating girls' education, has become a millionaire by signing a deal for around USD 3 million to publish her memoir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X