జగన్‌ పార్టీ ఎలా సహించిందో, నాతో కాలేదు: దానం

Danam Nagender
హైదరాబాద్: తమ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యులు ఎలా సహించారో తనకు తెలియడం లేదని, తాను మాత్రం భరించలేకపోయానని రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ అన్నారు. తాను అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానినే అని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానం ఉంది కాబట్టే తాము సిఎల్పీ కార్యాలయం నుంచి చిత్రాన్ని తీసేయలేదని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వైయస్సార్‌పై తెలుగుదేశం సభ్యులు చేసిన వ్యాఖ్యలు అభిమానులను బాధపెట్టాయని ఆయన అన్నారు. బాధ్యత లేని వ్యక్తినైతే ఆ సమయంలో తన ప్రతిస్పందన వేరే విధంగా ఉండేదని ఆయన అన్నారు. తెలుగుదేశం వ్యాఖ్యలు సహించలేక తాను బయటకు వెళ్లిపోయానని ఆయన చెప్పుకున్నారు. తనను తాను నియంత్రించుకోవడం చాలా కష్టమైందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోబం పాపం తెలుగుదేశం పార్టీదేనని ఆయన విమర్శించారు. ఆ పాపాలను కడిగేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు దీక్షలు చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు పోరాటాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

విద్యుత్తు సమస్యలను ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం పరిష్కరించలేక రైతులను, ఆందోళనకారులను పొట్టన పెట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్తు సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం ఓ వైపు ప్రయత్నాలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నేతలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వకుండా రైతులను గందరగోళ పరచడం మంచిది కాదని ఆయన అన్నారు. మంత్రుల విదేశీ పర్యటనలు తప్పు కాదని, వ్యక్తిగత పనుల మీద సొంత ఖర్చులతోనే మంత్రులు రష్యా వెళ్లారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+