బాబుకు మరో తలనొప్పి: వంశీ తర్వాత గద్దె అసంతృప్తి

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జీగా కేశినేని నానిని నియమించడంపై గద్దె రామ్మోహన్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గన్నవరం లేదా విజయవాడ నుంచి తనకు పార్లమెంటు టికెట్ కేటాయిస్తారని తాను అనుకున్నానని, అయితే ఎవరినీ సంప్రదించకుండా కేశినేని నానిని నియమించారని ఆయన అన్నారు. ఈ విషయంపై వస్తున్నా మీ కోసం పాదయాత్ర తర్వాత తాను చంద్రబాబును కలుస్తానని ఆయన చెప్పారు.
కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి వల్లభనేని వంశీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన ఈ నెల 27వ తే్దీన తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం టిక్కెట్ తనకే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని కానీ, ఈ విషయమై సిట్టింగ్ శాసనసభ్యుడు దాసరి బాలవర్ధన రావును తనతో మాట్లాడించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి బాలవర్ధన రావుతో మాట్లాడిస్తే తనకు పూర్తి నమ్మకముంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవి రాష్ట్రంలో ఎంతో మందికి ఉందన్నారు. విజయవాడ పట్టణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతగా కృషి చేసినా పార్టీ అధిష్టానం మాత్రం తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదని ఆయన అన్నారు. కాగా, కృష్ణా జిల్లా విజయవాడ లోకసభ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా కేశినేని నాని నియమితులైన విషయం తెలిసిందే. కేశినేని నాని విజ్ఞప్తి మేరకు చంద్రబాబు విజయవాడ పట్టణ శాఖ టిడిపి అధ్యక్షుడిగా నాగుల్ మీరాని నియమించారు. ఇంతకుముందున్న వల్లభనేని వంశీమోహన్‌ను పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వర్గంలోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications