వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయమ్మ అమ్మమ్మ మృతి: షర్మిల పాదయాత్రకు బ్రేక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma - Sharmila
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు బ్రేక్ పడింది. ప్రస్తుతం షర్మిల కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ రోజు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ అమ్మమ్మ సోమమ్మ మృతి చెందారు. ఆమె వయస్సు 96. కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఇంట్లో ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఆమె కన్నుమూశారు.

ఆమె మృతి చెందిన విషయం తెలియడంతో పాదయాత్రలో ఉన్న షర్మిల హుటాహుటిన కడపకు బయలుదేరారు. బంధువు మృతి చెందిన కారణంగా షర్మిల పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. తదుపరి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలిపింది. అయితే, ఒకరోజు మాత్రమే ఆమె విరామం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

అంతకుముందు పాదయాత్రలో పాల్గొన్న షర్మిల ప్రస్తుత ప్రభుత్వం వివిధ రకాల పన్నులతో ప్రజల నడ్డిని విరుస్తోందని మండిపడ్డారు. ఆమె జొన్నలపాడు గ్రామంలో రచ్చబండ నిర్వహించి ప్రజల బాధలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ ఉండటం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలపై భారం పడకుండా వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. రాజన్న రాజ్యంలోనే అన్ని వర్గాలు లాభపడ్డాయన్నారు. తన సోదరుడు జగన్ వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారన్నారు. రైతులు, మహిళలకు వడ్డీలేని రుణాలిస్తారన్నారు. రాష్ట్రాన్ని వైయస్ హరితాంధ్రప్రదేశ్ చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆంధకార ప్రదేశ్‌గా మార్చిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు చెప్పినట్లుగానే కిరణ్‌కు బుద్ధి చెప్పాలన్నారు.

English summary
One day break to YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy's sister Sharmila padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X