గిన్నిస్‌లోకి జగన్‌కు అర్హత: సిఫార్సు చేస్తామని ఎద్దేవా

ఆయన శనివారం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిన్నిస్ బుక్ యాజమాన్యానికి సిఫార్సు చేసి అందులో వైయస్ జగన్నోహన్ రెడ్డి పేరు ఎక్కించేందుకు తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉరికి అర్హుడని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచుకున్నాడన్న ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సొంత పార్టీ నుండి మద్దతు లభించింది. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి పైన మండిపడితే కాంగ్రెసు పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. ఈసారి పలువురు సైలెంట్‌గా ఉన్నప్పటికీ ఇంకొందరు మద్దతు పలికారు.
ఆనం చెప్పింది కరెక్టేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి పార్థసారథి తదితరులు అన్నారు. మరికొందరు మంత్రులు కూడా ఇదే స్థాయిలో గళమెత్తేందుకు సిద్ధమవుతున్నారట. ఆనంకు పలువురు సీనియర్ మంత్రులు ఫోన్ చేసి అభినందనలు కూడా తెలిపారు. చాలా బాగా మాట్లాడావని, జగన్ వ్యవహార శైలిపై అసెంబ్లీలో తానుమాట్లాడతానంటే వారించి.. ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా ఈ స్థాయిలో విమర్శలు చేశావేంటని మంత్రి రఘువీరా సరదాగా అన్నారట.












Click it and Unblock the Notifications