సెల్లార్‌లోని 14 బైక్‌లను కాల్చేశారు: ఆకతాయిల పనా?

 Unknown persons set 14 bikes on fire
హైదరాబాద్/మెదక్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గుర్తు తెలియని దుండగులు పద్నాలుగు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. సనత్‌నగర్‌లోని ఎంకె రెసిడెన్సీ ఆపార్టుమెంటులో మంగళవారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు సెల్లార్‌లో ఉన్న పద్నాలుగు బైకులను కాల్చారు. ఈ ఘటనలో అవి మాడి మసయ్యాయి.

ఉదయం మంటలు వ్యాపించడంతో అపార్టుమెంటులోని వారు భయానికి గురయ్యారు. బయటకు పరుగెత్తారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మాటలను అదుపులోకి తెచ్చింది. మొదటి అంతస్తులో రసాయనిక గోడౌన్ ఉంది. అందరూ వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఇది మూడంతస్తుల భవనం.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. బైకులను దగ్ధం చేసింది ముందస్తు ప్రాణాళిక ప్రకారమా? లేక అనుకోకుండా ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెసిడెన్సిలో ఉంటున్న వారు వెంటనే స్పందించడం వల్ల ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఎవరో వచ్చి బైకులను పెట్రోలు పోసి దగ్ధం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆకతాయిల పని కూడా అయి ఉంటుందంటున్నారు.

ట్రాన్సుఫారాన్ని ఢీకొన్న ఆర్టీసి బస్సు

మెదక్ జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారంలో ఓ ఆర్టీసి బస్సు అదుపు తప్పి ట్రాన్సుఫారాన్ని ఢీకొట్టింది. బస్సు వెళ్తుండగా స్టీరింగ్ రాడ్డు విరిగింది. దీంతో ఆ బస్సు అదుపు తప్పి ట్రాన్సుఫారాన్ని ఢీకొంది. బస్సు ఢీకొన్న సమయంలో విద్యుత్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సులో అరవై మందికి పైగా ప్రయాణీకులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+