రేప్ చేసి వీడియోలతో బెదిరింపు: యువతి ఆత్మహత్య

girl commits suicide for molesting
లక్నో: అత్యాచారాలపై ఎంతగా ఆందోళనలు చేసినా తగ్గటం లేదు. మంగళవారం మరో రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మైనర్ తీరని కుర్రాళ్లు వీటిల్లో నిందితులు కావడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియా జిల్లా భత్పరాణి ప్రాంతంలో ఐదేళ్ల పాపపై 15 ఏళ్ల కుర్రాడు అత్యాచారం జరిపాడు. ఇలాంటిదే మరో ఘటన మధ్యప్రదేశ్‌లో జరగగా, బాధితురాలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. చందోలీకు చెందిన గిరిజన బాలికను మైనర్ కుర్రాడు బలవంతంగా ఎత్తుకుపోయి అత్యాచారం జరిపాడు. అనంతరం ఆమె కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడింది.

అత్యాచారం జరిపి ఆ అశ్లీల దృశ్యాలను పదిమందికి చూపిస్తానంటూ బెదిరించడంతో ఓ గర్భిణి మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకొంది. థానేకు చెందిన మహ్మద్ సుల్తాన్ అలియాస్ రాజా(27) ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనారిటీ తీరని అమ్మాయిపై అత్యాచారం జరిపాడు. ఆ దృశ్యాలను బయటపెడతానంటూ పూర్తిగా లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో తాను గర్భం దాల్చినట్టు ఆమె గుర్తించింది. విషయం ఇంట్లో తెలుస్తుందేమోనని భయపడి.. కిరోసిన్ పోసుకొని అంటించుకుంది.

ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో 14 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఇదే రాష్ట్రంలోని బన్సదేశ్ ప్రాంతంలో 15 ఏళ్ల అమ్మాయిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. జైపూర్‌లో ఓ కూలీపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. మరోవైపు, ఢిల్లీ బాలిక వేగంగా కోలుకుంటున్నట్టు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+