టిడిపి సభా వేదిక వద్ద పసుపు నీళ్లతో జగన్ పార్టీ శుద్ధి

Chandrababu Naidu's Vastunna Meekosam padayatra
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రను నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆదివారం వినూత్న నిరసన తెలిపింది. శనివారం విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పాదయాత్ర ముగింపు సభ జరిగిన విషయం తెలిసిందే.

ఈ సభ ముగియడంతో ఆదివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విద్యార్థి విభాగం కార్యకర్తలు పసుపు నీళ్లతో బాబు పాదయాత్ర ముగింపు జరిగిన వేదిక వద్ద శుద్ధి చేశారు. చంద్రబాబు నాయుడు పాలన మళ్లీ రావొద్దని, అలాంటి పాలన వస్తే కష్టాలు తప్పవంటూ విద్యార్థులు ఈ శుద్ది కార్యక్రమాన్ని నిర్వహించారు.

నిన్న రాత్రి సభ ముగిసింది. దీంతో కార్యకర్తలు, ఇతరులు సభా ప్రాంగణ తొలగింపు పనులను చేపడుతున్నారు. ఈ సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విద్యార్థి విభాగం పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం చేపట్టడంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. వారిని పంపించారు.

రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు

నిన్నటి సభలో తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన, మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డిల పైన వివాదాస్పద ఆరోపణలు చేశారంటూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది.

విశాఖ 3 పోలీసు స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిని 420 అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారని, సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డిలు మహిళలు అని కూడా చూడకుండా మాట్లాడాలని వారు ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+