కూతుళ్లపై తండ్రి లైంగిక వేధింపులు, కంట్లోను పొడిచాడు

కర్నూలు జిల్లా కౌతాళం మండల కేంద్రానికి చెందిన షంషు ఐస్ క్రీం అమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి షంషూ వావి వరసలు మరిచి మూడేళ్ల క్రితం 15 ఏళ్ల పెద్ద కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
ఆమె ప్రతిఘటించడంతో మండుతున్న కట్టెతో కంట్లో పొడిచాడు. అయినా ఆమె లొంగలేదు. ఆ తర్వాత చిన్న కూతురిపై దృష్టి మళ్లింది. తండ్రి పశుబలం ముందు ప్రతిఘటించలేకపోయింది. దీంతో రెండుమూడుసార్లు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత సంవత్సరం ఆమెకు వివాహమైంది. ఈ విషయం తెలిసి భర్త ఆమెను వదిలేశాడు.
తండ్రి అఘాయిత్యం వల్ల ఓ కన్ను పోగొట్టుకున్న బాధితురాలు, లైంగికచర్య కారణంగా భర్తకు దూరమైన మరో బాధితురాలు ధైర్యం చేసి రాష్ట్ర హోంమంత్రికి ఆదివారం ఓ చానల్ ద్వారా తమ గోడును వివరించారు. హోంమంత్రి ఆదేశాలతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంతో ఆదివారం షంషు భార్య, కొడుకు, కూతుర్ని, ఇరుగుపొరుగు వారిని విచారించారు. షంషును ఆదివారం కౌతాళం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications