రేప్ కేసులో ఇద్దరు అరెస్ట్: ఐపిఎల్ బెట్టింగ్ రాయుళ్లూ..

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
నగరంలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఓ ముఠాను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు, రెండు సెల్ ఫోన్‌లు, రూ.6 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐపిఎల్ క్రికెట్ మ్యాచుల నేపథ్యంలో వీరు బెట్టింగులకు పాల్పడుతున్నారు. నలుగురు సభ్యులను అరెస్టు చేశారు.
బాలిక ఆత్మహత్య
కవాడిగూడలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. సోదరుని ప్రేమ వ్యవహారంలో అతని ఆచూకీ చెప్పాలని బాలికను పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు.
భారీ దొంగతనం
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్‌లోని ఆర్టీసి కాలనీలో భారీ చోరీ జరిగింది. 23 తులాల బంగారం, రెండు కిలోల వెండి, రూ.2.5 లక్షల నగదుతో పాటు ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారు.
ఓయులో విద్యార్థి ఆత్మహత్య
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రధాన గ్రంథాలయం వెనుక ప్రాంతంలో ఓ విద్యార్థి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
నడిరోడ్డుపై హత్యాయత్నం
వరంగల్ జిల్లా శాయంపేటలో నడి రోడ్డు పైన సతీష్ అనే వ్యక్తి పైన హత్యాయత్నం జరిగింది. ఐదుగురు వ్యక్తులు అతనిని పట్టుకొని పొడిచారు. గాయపడ్డ అతన్ని ఆసుపత్రికి తరలించారు.
కాంగ్రెసు నేత హత్య
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బోయినపల్లిలో కాంగ్రెసు నాయకుడు మల్లికార్జున హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు అతనిని వేటకొడవళ్లతో హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications