ముకేష్‌కు భద్రతపై సుప్రీం ప్రశ్న: బాలిక రేప్‌పై వ్యాఖ్య

ఐదేళ్ల బాలికపై అపార్టుమెంటులో ఇటీవల దారుణంగా అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ అత్యాచారాన్ని నిరసిస్తూ ఢిల్లీ వీధుల్లో నాలుగు రోజుల పాటు ప్రదర్శనలు జరిగాయి. ఆపార్టుమెంట్ భవనంలో సోదాలు నిర్వహించలేదని, అత్యాచారంపై ఫిర్యాదు చేయకుండా ఉండడానికి బాలిక తండ్రికి 2 వేల రూపాయల లంచం ఇవ్వజూపారని పోలీసులు తర్వాత అంగీకరించిన విషయం తెలిసిందే. బాలిక ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఐదేళ్ల బాలికను ఇద్దరు వ్యక్తులు తమ ఆపార్టుమెంటులో రెండు రోజుల పాటు బంధించి దారుణంగా రేప్ చేశారు. పాప అరుపులు విని తల్లిదండ్రులు పాపను రక్షించారు. ఈ తర్వాత ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి సాయుధ కమెండోలతో కూడిన పూర్తి స్థాయి భద్రత కల్పించాలని ప్రభుత్వం ఈ నెలారంభంలో నిర్ణయం తీసుకుంది. ముకేష్ అంబానీకి జడ్ క్లాస్ భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ముకేష్ ఇండియన్ ముజాహిదీన్ నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ ఆ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications