కూతురు పెళ్లి ఉంది, దేనికైనా సిద్ధం: విజయ సాయి

Vijaya Sai Reddy
న్యూఢిల్లీ: మే 26వ తేదిన కూతురు పెళ్లి ఉందని కాబట్టి బెయిల్‌ను కొనసాగించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఎ2 నిందితుడు విజయ సాయి రెడ్డి తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు.

విజయ సాయి రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం సిబిఐ తరఫు న్యాయవాది తన వాదనలను వినిపించారు. ఈ రోజు సాయి తరఫు న్యాయవాది వాదనలను వినిపించారు.

జగన్ ఆస్తుల కేసులో విజయ సాయి రెడ్డి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయలేదని, సిబిఐ విచారణ జరుపుతున్న అంశాల్లో విజయ సాయి రెడ్డి పేరును కూడా ప్రస్తావించలేదని, అలాంటప్పుడు అతని బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని లాయరు చెప్పారు. సాయి నెలలుగా బయట ఉన్నప్పటికీ సాక్ష్యులను ప్రభావితం చేయలేదన్నారు.

మే 26న విజయ సాయి రెడ్డి కూతురు వివాహం ఉందని, ఈ నేపథ్యంలో తాము ఏ నిబంధనకైనా అంగీకరిస్తామని చెప్పారు. అప్పటి వరకు ఢిల్లీలో ఉండమన్నా ఉంటామని చెప్పారు. ప్రస్తుతం విజయ సాయి స్టాట్యూటరీ బెయిల్ పైన ఉన్నారని లాయరు ఈ సందర్బంగా చెప్పారు. ఈ కేసులో సాయి లబ్ధిదారుడే కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+