ఎన్టీఆర్ విగ్రహం: భార్యతో జూ. ఎన్టీఆర్, ప్యామిలీ అంతా..

Jr NTR and Pranathi
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతున్నారు. ఆయన భార్య లక్ష్మిప్రణతితో కలిసి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. తన తండ్రి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులంతా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరువుతారని నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ చెప్పారు. రేపు మంగళవారం పదిన్నర గంటలకు పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని లోకసభ స్పీకర్ మీరా కుమార్ ఆవిష్కరిస్తారు.

కేంద్ర మంత్రి, ఎన్టీ రామారావు తనయ డాక్టర్ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యక్తిగత ఆహ్వానాన్ని మన్నించని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ తరఫున స్పీకర్ కార్యాలయం నుంచి ఆహ్వానం పొందారు. తమకు పార్టీ తరఫున ఆహ్వానం ఇస్తేనే వెళ్తామని ఆయన భీష్మించుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు స్పీకర్ మీరా కుమార్‌ను కలిసి తమ వాదనను వినిపించారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబుకు ఆహ్వానం అందింది.

చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హాజరు కానున్నారు. ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా చాలా రోజుల తర్వాత నందమూరి కుటుంబ సభ్యులంతా ఒక చోట కనిపించనున్నారు. చెప్పాల్సిన వారందరికీ చెప్పానని, అందరూ సంతోషంగా కార్యక్రమానికి వస్తారని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. దానికి మించి తాను మాట్లాడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.

కాగా, తనకు ఆహ్వానం అందించకపోవడంపై ఎన్టీ రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతి పురంధేశ్వరిపై భగ్గుమన్నారు. దీనిపై తాను కోర్టుకు వెళ్తానని ఆమె అన్నారు. మిగతా ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులంతా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. పార్లమెంటు ఆవరణలో ప్రతిష్టాపన కోసం ఎన్టీ రామారావు విగ్రహాన్ని పురంధేశ్వరి అందించారు. ఆమె కాంగ్రెసు పార్టీలో ఉండడం, ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన క్రెడిట్‌ను ఆమె కొట్టేయాలని చూడడం చంద్రబాబుకు రుచించడం లేదు. దీంతో ఆయన కొంత పేచీ పెట్టారు. ఏమైనా, ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు ఆటంకాలు తొలగినట్లే కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+