ఎన్టీఆర్ విగ్రహం: పంతం నెగ్గిన బాబు, స్పీకర్ ఆహ్వానం

Chandrababu Naidu
హైదరాబాద్: పార్లమెంటు ఆవరణలో ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణకు ఆహ్వానంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. స్పీకర్ మీరా కుమార్‌ నుంచి చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది. ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మీరా కుమార్ ఫోన్ చేసి చంద్రబాబుకు చెప్పారు. దాంతో ఆయన రేపు మంగళవారం ఆయన ఢిల్లీకి బయలుదేరే అవకాశం ఉంది.

తెలుగదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు సోమవారం ఉదయం లోకసభ స్పీకర్ మీరాకుమార్‌ను కలిశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు అధికారికంగా ఆహ్వానించాలని వారు స్పీకర్‌ను కోరారు. గతంలో ఆయా పార్టీల అధినేతలకు ఆహ్వానాలు పంపిన విషయాన్ని స్పీకర్ దృష్టికి తెచ్చినట్లు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు తెలిపారు. తమ వినతిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని వారు చెప్పారు.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు స్పీకర్ నుండి ఆహ్వానం రాలేదు. కుటుంబ సభ్యుడిగా పురంధేశ్వరి నుండి ఆయనకు ఆహ్వానం అందింది. పార్టీ అధ్యక్షుడి హోదాలో స్పీకర్ నుండి ఆయనకు ఆహ్వానం రాలేదు. వెళ్తే ఓ తంటా, వెళ్లకపోతే మరో తంటాగా మారే పరిస్థితిలో తెలుగదేశం పార్టీ పార్లమెటు సభ్యులు స్పీకర్‌ను కలిశారు.

ఆ విషయంపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వర రావు చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. ఆ తర్వాత ఢిల్లీకి రావాలని పార్టీ పార్లమెంటు సభ్యులందరికీ నామా వర్తమానం పంపించారు. ఎన్టీఆర్ విగ్రాహావిష్కరణకు పార్టీకి గానీ పార్టీ అధ్యక్షుడికి గానీ పార్లమెంటరీ పార్టీకి గానీ ఆహ్వానం అందలేదు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణించింది. రాజకీయం చేయడం తమకు ఇష్టం లేదంటూనే పార్టీకి ఆహ్వానం అందకపోవడాన్ని తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు స్పీకర్ దృష్టికి తీసుకుని వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+