గెలిస్తే గ్లామర్‌కే క్రెడిట్: చిరంజీవికి ప్రచార పరీక్ష(పిక్చర్స్)

హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి కర్నాటక ఎన్నికలు ఒకవిధంగా పరీక్షేనా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అంతకుముందు కూల్‌గా ఉన్న చిరంజీవి పర్యాటక శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా వెళ్తున్నారు. పార్టీ అధిష్టానం మెప్పు పొందే ప్రయత్నాలు అందులే లేకపోలేదు. అయితే, పర్యాటక శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. న్యాయం చేస్తున్నారని పార్టీ అధిష్టానం అభిప్రాయపడుతోంది.

ఇలాంటి సమయంలో కర్నాటక ఎన్నికలు చిరంజీవికి అధిష్టానం వద్ద మరింత ఇమేజ్‌ని పెంచాయనే చెప్పవచ్చు. కన్నడనాట చిరు ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలి రావడమే కారణం. చిరు తొలివిడతలో చిక్‌మగ్‌ళూరు, బెంగళూరులలో పర్యటించారు. ఆయనను చూసేందుకు వచ్చిన ప్రజలను పోలీసులు అదుపు చేయలేక లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో చిరుకు ఫిదా అయిన అధిష్టానం ఆయనను మరింత క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో 2, 3 తేదిల్లో మరోవిడత ప్రచారం చేయాలని సూచించింది. దీంతో అతను అనేకల్ తదితర నియోజకవర్గాల్లో రెండో దఫా ప్రచారం నిర్వహించారు.

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. కన్నడ నాట చిరు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లోని గెలుపోటములపై ఆయనపై ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెసు అభ్యర్థులు గెలిచినా, భారీ మెజార్టీతో గెలిచినా ఆ క్రెడిట్ చిరు ఖాతాలోకే వెళ్తుంది. ఓటమి ఆయన ఖాతాలోకి వెళ్లకున్నా.. చిరు ప్రచారం చేసినా ఒరిగిందేమీ లేదనే వాదన బయటకు వస్తుంది.

తద్వారా చిరు ఇమేజ్‌కు అధిష్టానం వద్ద డామేజ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. తారల ప్రచారానికి రావడమే తప్ప ఓటుపై అంతగా ప్రభావం పడదనే అభిప్రాయానికి అధిష్టానం మరోసారి వచ్చే అవకాశాలు లేకపోలేదు. చిరంజీవి రాష్ట్రంలో గతంలో కడప, పులివెందులనే కాకుండా ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోను ప్రచారం చేశారు. కానీ, కాంగ్రెసు విజయం సాధించలేదు. చిరు ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆయనను చూసి భారీగానే ఓట్లు పడినా గెలిచింది మాత్రం 18 సీట్లే.

చిరు గ్లామర్‌కు 'ప్రచార' పరీక్ష(పిక్చర్స్)

కర్నాటక ఎన్నికల ప్రచారంలో చిరంజీవి

చిరు గ్లామర్‌కు 'ప్రచార' పరీక్ష(పిక్చర్స్)

ప్రచారంలో సోనియా గాంధీతో మెగాస్టార్

చిరు గ్లామర్‌కు 'ప్రచార' పరీక్ష(పిక్చర్స్)

చిరును చూసేందుకు, కరచాలనానికి అభిమానులు, ప్రజల ఉత్సాహం

చిరు గ్లామర్‌కు 'ప్రచార' పరీక్ష(పిక్చర్స్)

కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో చిరంజీవి ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి భారీగా జనాలు వచ్చారు. ఆయన వైయస్ వివేకానంద రెడ్డి తరఫున పులివెందులలో భారీగా ప్రచారం చేశారు.

చిరు గ్లామర్‌కు 'ప్రచార' పరీక్ష(పిక్చర్స్)

సానుభూతి పవనాల కారణంగా ఆ ఎన్నికల్లో జగన్, విజయమ్మలు ఘన విజయం సాధించారు.

చిరు గ్లామర్‌కు 'ప్రచార' పరీక్ష(పిక్చర్స్)

ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో చిరు ప్రచారం చేశారు. కాంగ్రెసు రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. చిరు ఇమేజ్ కూడా ఉపయోగపడలేదని ఆయన వ్యతిరేకులు అంటే.. చిరు వల్లే ఆ రెండు స్థానాల్లోనైనా గెలిచామని ఆయన వర్గం చెప్పింది.

చిరు గ్లామర్‌కు 'ప్రచార' పరీక్ష(పిక్చర్స్)

ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత 2009లో చిరు ఎన్నికల ప్రచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+