రాజకీయాల్లోకి లాలూ కూతురు మిసా భారతి

రాజకీయ నేతల పిల్లలు రాజకీయాల్లోకి రావడంలో తప్పేమీ లేదని, రాజకీయాల్లో తనకు ఆసక్తి ఉందని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానా, లేదా అనేది చెప్పడం ప్రస్తుతం సాధ్యం కాదని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. మిసా భారతిని పార్టీలోకి తీసుకుని వచ్చి, తన బాధ్యతలను కొన్నింటిని ఆమెపై మోపాలని లాలూ ప్రసాద్ యాదవ్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
మహరాజ్ గంజ్ పార్లమెంటరీ సీటుకు ప్రభునాథ్ సింగ్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే విషయంపై ఛాప్రాలో లాలూ ప్రసాద్ యాదవ్ తీరిక లేకుండా ఉన్నారు. ఆ సమయంలో మంగళవారం మిసా భారతి బుధవారం గాంధీ మైదాన్‌లో జరిగే ర్యాలీ ఏర్పాట్ల విషయంలో కార్యకర్తలకు సూచనలు ఇస్తూ కనిపించారు.
గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. తండ్రీకొడుకులు ప్రచార కార్యక్రమంలో కలిసి పాల్గొన్నాైరు. 2010 శానససభ ఎన్నికల సమయంలో చిన్న కుమారుడు తేజస్వి తన తల్లి రబ్రీ దేవి తరఫున ప్రచారం చేస్తూ కనిపించారు. బీహార్‌లో విద్యాపరిస్థితిపై జరిగిన సమావేశానికి ఇటీవల తేజస్వి అధ్యక్షత వహించారు.












Click it and Unblock the Notifications