Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నన్నేకాదు పెద్దల్నీ తప్పిస్తారు, చిరు కోసమడిగా: సిఆర్సీ

C Ramachandraiah
హైదరాబాద్: మంత్రివర్గం నుండి తనను తప్పిస్తారని జరుగుతున్న ప్రచారంపై దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య శుక్రవారం స్పందించారు. తనను మాత్రమే కాదని చాలామంది పెద్దల్ని కూడా తప్పిస్తారని ప్రచారం సాగుతోందని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలను తప్పించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అభియోగాలు ఉన్న మంత్రులు సబితా రెడ్డి, ధర్మాన ప్రసాద రావులపై కూడా వేటే పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

దీంతో ఆయన తనను మాత్రమే కాదని చాలమంది పెద్దల్ని తప్పిస్తారని ప్రచారం సాగుతోందన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఎందుకు కాకూడదని తాను అడిగానని చెప్పారు. కర్నాటకలో క్లీన్ ఇమేజ్‌తో కాంగ్రెసు పార్టీ గెలుపొందిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి అదే క్లీన్ ఇమేజ్ ఉండాలని అబిప్రాయపడ్డారు.

గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ

గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు రామచంద్రయ్య తెలిపారు. గోశాలల సంరక్షణ తమ బాధ్యత కాదని మానవతా దృక్పథంతోనే వాటిని పర్యవేక్షిస్తున్నామన్నారు. వసతులున్న స్వచ్ఛంద సంస్థ ముందుకు వస్తే సింహాచలం గోశాలను అప్పగిస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+