వడదెబ్బకు పెళ్లికుమారుడి మృతి: ఆగిన పెళ్లి

కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్లు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అక్కుర్తిలో ముగ్గురు విద్యార్థులు మరణించారు. స్థానికంగా ఉన్న చెరువులో ఈత కోసం వెళ్లి వారు మరణించారు. శనివారం ఉదయం ఈతకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వరంగల్‌లో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుమంచి పోలీసులు 11.30 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను 21 కేసుల్లో నిందితుడని ఎస్పీ వెంకటేశ్వర రావు చెప్పారు.
మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం వద్ద అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications