వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోతిలో పడి గిలగిల, మా బాధేంటి?: మంత్రులపై షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
ఏలూరు: తన సోదరుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డ అధికార కాంగ్రెసు పార్టీ తాను తీసుకున్న గోతిలోనే పడిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మంగళవారం మండిపడ్డారు. ఆమె మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలుచోట్ల ఆమె మాట్లాడారు.

జగన్ కేసులో మంత్రుల తీరుపై ఆమె నిప్పులు చెరిగారు. 26 జివోలపై కోర్టు నోటీసులు ఇస్తే కాంగ్రెసు ప్రభుత్వం, మంత్రులు సమాధానమివ్వలేదని ఆరోపించారు. జివోలతో సంబంధం లేని జగన్‌ను జైలుకు పంపుతుంటే వీరంతా మౌనంగా ఉండిపోయారని, ఇప్పుడు వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారన్నారు. ఇప్పుడు ఆ జీవోలు అన్ని సక్రమమేనని ఒప్పుకుంటున్నారని విమర్శించారు. వారికి ఉచ్చు బిగిసుకోగానే మంత్రులు గిలగిల కొట్టుకుంటున్నారన్నారు.

నేరం రుజువు కాకుండా తమను కళంకిత మంత్రులు ఎలా అంటారని వారు ప్రశ్నిస్తున్నారని, మరి ఏ కోర్టు చెప్పకుండానే జగన్‌ను దోషి అని అంటే మాకు బాధ కలగదా అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు. ఆయన అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు ఓ రోజు మాట్లాడుతూ.. బాబును మించిన అవినీతిపరుడు ఈ ప్రపంచంలోనే లేడన్నారని, అసలు సిసలు అవినీతిపరుడు ఆయనేనని, నిస్సిగ్గుగా ఢిల్లీకి వెళ్లి ఇక్కడ అవినీతి గురించి మాట్లాడుతున్నారన్నారు. తనపై విచారణలు, కేసులు జరగకుండా ఉండేందుకు చీకట్లో చిదంబరాన్ని కలిశారన్నారు.

English summary

 YSR Congress Party chief YS Jaganmohan Reddy's sister Sharmila has questioned that How can any one say that Jagan is guilty and has been convicted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X