తమిళనాడులో ఆ పార్టీదే అధికారం.. రెడ్ కార్పెట్

తాజాగా ముగిసిన నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం ఆరంభమైంది. పశ్చిమ బెంగాల్‌లో చివరిదశ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా హౌస్‌లు, ఎన్నికల సర్వేల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందరి కళ్లూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి.

తమిళనాడుపై వెలువడిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా డీఎంకేకు జైకొట్టాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. 2021తో పోలిస్తే మెజారిటీ మార్జిన్ తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డాయి. రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్ టీవీకే (TVK) పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకులను చీల్చే అవకాశం ఉందని ఈ అంచనాలు పేర్కొన్నాయి.

DMK Hold on Tamil Nadu Faces Subtle Yet Significant Vijay TVK Challenge by Matrize and Chanakya

మొత్తం 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో.. నాలుగు ఎగ్జిట్ పోల్స్‌లో మూడు డీఎంకే+ కూటమికి పట్టం కట్టాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 నియోజకవర్గాల మేజిక్ ఫిగర్ ను అందుకుంటుందని తెలిపాయి. పీమార్క్ అంచనాల ప్రకారం, డీఎంకే+ కూటమి 122-132 సీట్లు సాధించి మెజారిటీ సీట్లను అందుకుంటుంది. ఏఐఏడీఎంకే కూటమికి 87-100 సీట్లు, విజయ్ టీవీకే పార్టీకి 10-12 సీట్లు వస్తాయని పేర్కొంది. టీవీకే తొలి ఎన్నికలోనే గణనీయ ప్రభావం చూపుతుందని పీమార్క్ సూచించింది.

మరో సర్వే సంస్థ మాట్రిజ్ అంచనాలు పీమార్క్‌ను పోలి ఉన్నాయి. దీని ప్రకారం డీఎంకే+కు 122-132 సీట్లు, ఏఐఏడీఎంకే+కు 87-100 సీట్లు లభిస్తాయని అంచనా వేసింది. టీవీకేకు 10-12 సీట్లు, ఇతరులకు 0-6 సీట్లు వస్తాయని ఇది సూచించింది. జేవీసీ ఎగ్జిట్ పోల్ మిగిలిన అంచనాలకు భిన్నంగా ఏఐఏడీఎంకే తిరిగి తమిళనాడులో అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. డీఎంకే+కు 75-95, ఏఐఏడీఎంకేకు 128-147, టీవీకేకు 8-15 సీట్లు వస్తాయని నివేదించింది. చాణక్య కూడా డీఎంకే వైపే మొగ్గు చూపింది.

యాక్సిస్ మైఇండియా అంచనాలు మరింత విభిన్నంగా టీవీకేకు అనూహ్య విజయాన్ని సూచించాయి. డీఎంకే+కు 92-110, ఏఐఏడీఎంకేకు కేవలం 22-32 సీట్లు లభిస్తాయి. విజయ్ టీవీకేకు ఏకంగా 98-120 సీట్లు వస్తాయని అంచనా వేస్తూ, ఇది ముక్కోణపు పోటీకి దారితీస్తుందని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి టీవీకే పైనే ఉంది. పార్టీ సీట్ల అంచనాలు, పోల్ స్టర్స్ మధ్య భిన్నంగా ఉన్నప్పటికీ, తక్కువ అంచనాలు కూడా ప్రతిపక్ష ఓట్లను చీల్చి ఫలితాలను ప్రభావితం చేయగలవని అభిప్రాయపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+