1983 పునరావృతం చేద్దాం, ప్రభంజనం సృష్టిస్తా: లోకేష్

తాను తన ఉద్యోగానికి రాజీనామా చేశానని, యువత భవిష్యత్తు కోసం ఓ విజన్... వారికి ఉద్యోగాల కల్పనకు ఓ మిషన్ రూపొందించుకుంటానని చెప్పారు. వచ్చే ఏడాది యువతను, విద్యార్థులను ఏకం చేసి వారిలో చైతన్యం తీసుకువచ్చి ప్రభంజనం సృష్టిస్తానని చెప్పారు. 1983లో కాంగ్రెసును ప్రజలు ఎలా తరిమి కొట్టారో 2014లోను అదే పరిస్థితి పునరావృతమయ్యేలా చేస్తానన్నారు.
2004లో ఇంజినీరింగు ఆఖరు సంవత్సరం చదువుతుండగానే ఉద్యోగాలకు అవకాశాలు వచ్చేవని, ఇప్పుడు మాత్రం కాంగ్రెసు పాలనలో అవినీతి కారణంగా ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. తాను ఇక నుండి కార్యర్తలకు అండగా ఉంటానని, ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడమే తన లక్ష్యమన్నారు. కార్యకర్తలు, నాయకులు కూడా అందుకోసం పాటుపడాలన్నారు.
అంతకుముందు రోజు నారా లోకేష్ కరీంనగర్ జిల్లాలోని మినీ మహానాడులో పాల్గొన్న విషయం తెలిసిందే. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్ 2014లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యువతను కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications