చంద్రబాబు చేతిలో ఉచ్చ కూడా పోయరు: కెసిఆర్

చంద్రబాబుకు తెలంగాణపై స్పష్టత ఉంటే మహానాడులో తెలంగాణపై తీర్మానం చేయాలని సవాల్ విసిరారు.
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రాజకీయ శిక్షణ తరగతులను శుక్రవారం నిర్వహించారు. మహానాడులో తెలంగాణపై తీర్మానం అవసరం లేదని చంద్రబాబు చెంచాగాడైన తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అంటున్నారని, కానీ చంద్రబాబుకు తెలంగాణపై ఏ మాత్రం స్పష్టత ఉన్నా మహానాడులో తీర్మానం పెట్టాలని ఆయన అన్నారు.
సంక్రాంతి పండగకు గంగిరెద్దుల వాళ్ల మాదిరిగా మళ్లీ మనలను గోల్‌మాల్ చేసేందుకు సీమాంధ్ర పార్టీలు వందల కోట్ల రూపాయలు, లిక్కర్ బాటిళ్లు పట్టుకుని వస్తారని అంటూ అలాంటి వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని, ఒకవేళ వచ్చినా సీఎం తెలంగాణ నాయకుడు కాడని అన్నారు. చంద్రబాబునాయుడో, బాలకృష్ణో, లోకేశో, పీకేశో ఎవడో ఒకడవుతాడని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే షర్మిల కాకుంటే ఉర్మిళ అవుతదనీ, తెలంగాణ వాడు సీఎం కాడని కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో సీమాంధ్ర పెత్తనంపై గ్రామాల్లో, బస్తీల్లో, లగ్గాల్లో, ధావతుల్లో, చివరకు బస్సుల్లో చర్చించి ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణ తెచ్చేది మేమే.. ఇచ్చేదీ మేమే అని బుడ్డర్‌ఖాన్‌లాగా నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో వంద, 17 ఎంపీ స్థానాల్లో 16 స్థానాలను గెలుచుకుని ఢిల్లీని శాసించి తెలంగాణ తెచ్చుకుందామన్నారు.












Click it and Unblock the Notifications