శ్రీశాంత్ చెప్పిన నలుగురిలో గేల్ ఉన్నాడా?, సాక్షి సేఫ్

చెన్నై ఫ్రాంచైజీతో పాటు మరికొన్ని జట్లలోని నలుగురు ఆటగాళ్లకు ఇందులో ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ నలుగురి పేర్లను శ్రీశాంత్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అరెస్టైన బాలీవుడ్ నటుడు విందూ కూడా ముగ్గురి పేర్లు చెప్పాడు. వీరిలో ఓ అంతర్జాతీయ ఆటగాడు ఉన్నాడట. వారి పేర్లను బయటకు చెప్పని పోలీసులు విదేశీ ఆటగాళ్ల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టులోని క్రిస్ గేల్ పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అతడికి బుకీల నుండి ముడుపులు అందాయట. ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో పాలుపంచుకున్నారని అనుమానిస్తున్న బుకీలు పవన్, సంజయ్‌లు రూ.4.5 లక్షళ విలువైన బంగారు ఆభరణాలను గేల్‌కు బహుమతిగా ఇచ్చారని సమాచారం. ఫిక్సింగ్ ఉదంతం బయట పడ్డాక వీరు కనిపించకుండా పోయారు.
జైపూర్‌లో ఓ షోరూంలో శ్రీశాంత్‌తో కలిసి గేల్ బంగారం కొన్నాడట. వారు కొన్నప్పటికి జిజు బిల్లు చెల్లిస్తున్నారట. శ్రీశాంత్ పేర్లు వెల్లడించిన నలుగురిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
ధోనీ భార్య సేఫ్
విందూతో కలిసి మ్యాచులు చూసిన ధోనీ భార్య సాక్షిని ప్రస్తుతానికి విచారించాల్సిన అవసరం లేదని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తేల్చారు. ఏ బుకీ కూడా ఆ పేరను ఎక్కడా ప్రస్తావించలేదని, సరైన ఆధారాలు లభించలేదని తర్వాతే ఆమెను విచారించే అంసం గురించి ఆలోచిస్తామన్నారు.












Click it and Unblock the Notifications