వద్దు: బాలకృష్ణపై పోచారం ఫైర్, బాబుపై పొంగులేటి

తెలుగుదేశం పార్టీనే చక్కదిద్దుకోలేని చంద్రబాబు తృతీయ కూటమిలో చక్రం తిప్పుతానని అనడం ఉత్తర కుమార ప్రగల్భాలేనని ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే సైకిల్‌కు పంక్చర్ అయిందని, ఇక అది బాగుపడడం సాధ్యం కాదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
మహానాడు జరిగిన తీరుతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని ఆయన అన్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ అనేది ముఖ్యమంత్రి, పార్టీ అధిష్టానం పరిధిలోని అంశమని చెప్పారు. అయితే, మంత్రివర్గంలో ఖాళీలు ఉన్నాయి కాబట్టి భర్తీ చేయకతప్పదని ఆయన అన్నారు. సీనియర్ మంత్రులు కొందరైనా పార్టీ సేవలకు మళ్లితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టయి ఏడాది అయిన సందర్భంగా ఆ పార్టీ నేతలు దీక్షలు చేపట్టడం విడ్డూరంగా ఉందని కాంగ్రెసు నాయకుడు తలసిరెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల వికృత చేష్టలు చూస్తుంటే వారికి కోర్టులన్నా, రాజ్యాంగం అన్నా కనీస గౌరవం లేదని ఆయన అన్నారు. ఆరాచకవాదమొక్కటే వైయస్సార్ కాంగ్రెసు సిద్ధాంతమని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications