వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంజయ్ దత్ సంపాదన రూ. 25: కాయకష్టానికి నో

By Pratap
|
Google Oneindia TeluguNews

 Sanjay Dutt
పూణే: ముంబై పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పూణేలోని యెరవాడ జైలులో కాగితం సంచులు చేసే పని నేర్చుకోనున్నారు. ఆయనకు రోజుకు 25 రూపాయలు చెల్లించే అవకాశం ఉంది. నాణ్యమైన కాగితం సంచులను తయారు చేయడంలో సంజయ్ దత్‌కు శిక్షణ ఇస్తామని, మార్కెట్లో ప్లాస్టిక్ సంచుల స్థానంలో కాగితం సంచులు వస్తున్నాయని, దీంతో సంజయ్ దత్‌కు ఆరు నుంచి ఎనిమిది కిలోల సరుకులు పట్టే కాగితం సంచులు చేసే పని అప్పగిస్తామని జైలు అధికారులు అంటున్నారు.

సంజయ్ దత్ ప్రావీణ్యాన్ని, సమర్థతను బట్టి ఆయనకు చెల్లించే డబ్బులు 40 రూపాయల వరకు పెరుగుతుందని చెబుతున్నారు. అయితే, కాయకష్టం చేసే పని అప్పగించాలని సంజయ్ దత్ చేసిన విజ్ఞప్తిని జైలు అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా నిరాకరించారు. తనకు రాత్రిపూట నిద్ర పట్టడం లేదని అందువల్ల శరీరం అలసిపోయేలా చేసే పని కావాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, సంజయ్ దత్ విన్నపాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నారు.

సంజయ్ దత్ ప్రాణానికి జైలులో ముప్పు ఉందంటూ ఇప్పటికే పలు ఏజెన్సీల నుంచి మాకు సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో సంజయ్ మిగతా ఖైదీలతో కలవడానికి అవకాశం లేదని, అందుకే ఆయనకు శ్రమతో కూడిన పని కల్పించలేకున్నాం అని జైలు ఎస్పీ యోగేష్ దేశాయ్ వివరించారు.

కాగా, ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్‌కు ఐదున్నరేళ్ళ జైలు శిక్షను సుప్రీంకోర్టును ఖరారు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ శిక్షను పూణెలోని యెరవాడ కేంద్ర కారాగారంలో అనుభవిస్తున్నాడు.

English summary

 Jailed Bollywood actor Sanjay Dutt will be trained to make paper bags at the Yerawada Central Jail, official sources said on Saturday. He is likely to be paid Rs.25 a day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X