ప్రచారానికే పరిమితమా?: పార్టీ నేతలకి విజయమ్మ క్లాస్

ఆమె శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆమె ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడారు. కేవలం ప్రచారానికే పరిమితం కావొద్దని, అది సరికాదని, గ్రూపు రాజకీయాలను విడిచి అందరు కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు.
షర్మిల యాత్ర
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె పలు ప్రాంతాల్లో మాట్లాడారు. బెల్టు షాపుల పాపం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుదేనని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ పెట్టి మరీ తాగిస్తోందన్నారు. బెల్టు షాపుల విషయంలో ప్రభుత్వం కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన చంద్రబాబు అధికార కాంగ్రెసు పార్టీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. శనివారం నాటికి షర్మిల పాదయాత్ర 166 రోజులు పూర్తయింది.












Click it and Unblock the Notifications