వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్! 1969లో నీ అడ్రస్ ఎక్కడ? నీతోనేకాదు: నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao - Nagam Janardhan Reddy
హైదరాబాద్: జార్ఖండ్ రాష్ట్రంపై, ఉద్యమంలో తన పాత్రపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నేత, నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం ధీటుగా స్పందించారు.

జార్ఖండ్‌లో బిజెపి పార్లమెంటు స్థానాలు గెలిచిన తర్వాతనే రాష్ట్రం వచ్చిందనే విషయం కెసిఆర్ తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టక ముందే బిజెపి తెలుగు వారికి రెండు రాష్ట్రాలుండాలని చెప్పిందన్నారు. తెలంగాణ ఇస్తామని కూడా ప్రకటించిందన్నారు. తెలంగాణకు బిజెపి కట్టుబడి ఉందన్నారు.

1969 నాటి తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. 2001లోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని కెసిఆర్ భావిస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. కెసిఆర్ నిక్కర్లు వేసుకున్నప్పుడే తాను తెలంగాణ కోసం 1969లో జైలుకు వెళ్లానని ఆయన చెప్పారు.

కాగా, సోమవారం కెసిఆర్ జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏ జాతీయ పార్టీ తెచ్చిందని, జార్ఖండ్ ముక్తి మోర్చా జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. తెరాస వచ్చాకే తెలంగాణవాదాన్ని నాగం ఎత్తుకున్నారని, తెరాస రాకుంటే టిడిపిలోనే ఉండేవాడివని అన్నారు. దానిపై నాగం కౌంటర్ ఇచ్చారు.

English summary
BJP leader Nagam Janardhan Reddy has questioned TRS chief K Chandrasekhar Rao that where is his address in 1969 agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X