వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎల్ రవీంద్ర వస్తారని సిఎల్పీ మీడియా రూంకు తాళం

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి సిఎల్పీలో విలేకరుల సమావేశానికి కాంగ్రెసు పార్టీ నిరాకరించింది. తాను సిఎల్పీలో ప్రెస్ మీట్ పెడతానంటూ డిఎల్ మంగళవారం ఉదయం సమాచారం అందించారు. డిఎల్‌కు సిఎల్పీలో ప్రెస్ మీట్‌కు అనుమతివ్వాలా వద్దా అనే అంశంపై సిబ్బంది మొదట తర్జన భర్జన పడింది. అనంతరం పెద్దల సూచనల మేరకు డిఎల్ ప్రెస్ మీట్‌‍కు అనుమతి నిరాకరించినట్లుగా తెలుస్తోంది.

మొదట సిఎల్పీలోని మీడియా గదిని సిబ్బంది తెరిచారు. ఆ తర్వాత డిఎల్ రవీంద్రా రెడ్డి వస్తారేమోనని భావించిన సిబ్బంది వెంటనే తెరిచిన గదికి హడావుడిగా తాళం వేసింది. దీంతో డిఎల్ ప్రెస్ మీట్‌కు అనుమతి నిరాకరించినట్లుగా తెలుస్తోంది. డిఎల్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతారనే కారణంతోనే మీడియా సమావేశానికి సిఎల్పీ నిరాకరించింది.

గతంలో మాజీ మంత్రి శంకర రావుకు కూడా సిఎల్పీలో ప్రెస్ మీట్‌కు నిరాకరించారు. శంకర రావు సైతం డిఎల్ విధంగానే గతంలో పదవిని కోల్పోయారు. శంకర రావు నిత్యం కిరణ్‌ను టార్గెట్ చేశారు. దీంతో గతేడాది ఆయనను మంత్రి వర్గం నుండి కిరణ్ తొలగించారు. డిఎల్ కూడా కిరణ్‌ను ఎప్పటి నుండో టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆయనను మూడు రోజుల క్రితం బర్తరఫ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతారని డిఎల్‌ ప్రెస్ మీట్‌కు అనుమతిని నిరాకరించారు.

డిఎల్‌తో డిప్యూటీ భేటీ

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం డిఎల్‌తో దాదాపు పావుగంట పాటు భేటీ అయ్యారు. అనంతరం డిఎల్ సిఎల్పీకి బయలుదేరారు. సిఎల్పీలో భేటీకి అనుమతివ్వక పోవడంతో ఆయన బయటే మాట్లాడే అవకాశముంది.

English summary
DL Ravindra Reddy will talk with media on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X