వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిత్రుడి వాంగ్మూలం: చిక్కుల్లో శిల్పా శెట్టి భర్త కుంద్రా

By Pratap
|
Google Oneindia TeluguNews

Raj Kundra
న్యూఢిల్లీ: ఐపియల్ ఫ్రాంచైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. తన పాస్‌పోర్టును కుంద్రా ఢిల్లీ పోలీసులకు స్వాధీనం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దేశం విడిచి వెళ్లొద్దని పోలీసులు ఆయనను ఆదేశించినట్లు సమాచారం. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై పోలీసులు రాజ్ కుంద్రాను బుధవారం దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించారు.

ఐపియల్ మ్యాచుల సందర్భంగా కుంద్రా బెట్టింగ్‌కు పాల్పడినట్లు, దానిపై కేసు నమోదు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిత్రుడు ఉమేష్ గోయంకా పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కుంద్రా చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. వ్యూహం, జట్టు కూర్పు, పిచ్ స్థితి, గెలిచే అవకాశాలు ఉన్న జట్టు వంటి వివరాలను అతను రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లను అడిగేవాడని తెలుస్తోంది.

గోయంకా వాంగ్మూలాన్ని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేసినట్లు సమాచారం. దీంతో దాని నుంచి గోయంకా వెనక్కి తగ్గడానికి వీలుండదు. ఇతరుల పాత్ర గురించి మాత్రమే కాకుండా అరెస్టయిన ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిల గురించి మరింత సమాచారాన్ని అందించినట్లు చెబుతున్నారు. గోయంకాకు చెందిన అహ్మదాబాద్‌లోని అశ్వినీ స్టీల్ ప్రైవెట్ లిమిటెడ్‌లో గోయంకా భాగస్వామి.

రాజస్థాన్ రాయల్స్ అటగాడు సిద్ధార్థ్ త్రివేది గోయంకా గురించి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో కుంద్రాను విచారణ నిమిత్తం పోలీసులు పిలిచినట్లు చెబుతున్నారు. గోయంకా ఏ హోదాలో ఆటగాళ్లతో ముచ్చటించాడనే అంశంపై పోలీసులు కుంద్రాను ప్రశ్నించినట్లు సమాచారం. తన జట్టు ఆటగాళ్లను ఓపెన్ పార్టీలకు అనుమతించడంపై కూడా అడిగినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో శిల్పా శెట్టిని కూడా పోలీసులు విచారించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

English summary

 Rajasthan Royals co-owner Raj Kundra has surrendered his passport to Delhi Police in the IPL spot-fixing scandal, according to TV reports on Thursday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X