మూడొంతులు మావే, వారి ఒత్తిడి: అనర్హతపై పెద్దిరెడ్డి

సిబిఐని కేంద్రం నీరుగార్చినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభాపతి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ పైన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి పని చేసిందన్నారు. రెండు నెలల క్రితం అనర్హులుగా ప్రకటించి ఉంటే ఎన్నికలు జరిగి ఉండేవన్నారు.
అప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరి బలం ఏంటో ప్రజలు తేల్చే వారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకే కాంగ్రెసు ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు.
క్విడ్ ప్రోకో అంటూ తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలులో ఉంచారని మండిపడ్డారు. అదే క్విడ్ ప్రోకో మంత్రులకు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. 2జి స్పెక్ట్రంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిందితురాలు కాదా అని అడిగారు.












Click it and Unblock the Notifications