అసెంబ్లీలో కిరణ్‌తో డిఎల్ రె'ఢీ': జూనియర్లతో సీటు, రగడ

సీటు వివాదం
మరోవైపు డిఎల్ రవీంద్రా రెడ్డికి అసెంబ్లీలో కేటాయించిన సీటు పైన కూడా రగడ చోటు చేసుకుంది. డిఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్ కావడంతో ఆయనకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల మధ్య సీటు కేటాయించారు. దీనిపై డిఎల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి పెత్తనమేనా, స్పీకర్ నిర్ణయాలకు అవకాశం లేదా అని ఆయన మండిపడుతున్నారు. తనకు కొత్త వారి మధ్య సీటు కేటాయించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
డిఎల్‌కు ప్రస్తుతం 79వ సీటును కేటాయించారు. గతంలో సీనియర్ సభ్యుడిగా ఆయనకు సీనియర్ నేతల మధ్య సీటును కేటాయించేవారు. మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ రోశయ్య హయాంలోను ఆయనకు ముఖ్యమంత్రి వరుసలోని వెనుక సీటులో కేటాయించారు. ఇప్పుడు మాత్రం ఆయనను జూనియర్ల పక్కకు పంపించారు.
జూనియర్ల మధ్య ఎందుకు?
డిఎల్‌కు సీనియర్ల మధ్య కాకుండా కొత్తవారి మధ్య కేటాయించడానికి ఓ కారణముందని అంటున్నారు. సీనియర్లు, మాజీ మంత్రులు కూర్చున్న చోటు నుండి ముఖ్యమంత్రి వెళుతుంటారు. ఆయన వెళ్లే దారిలో డిఎల్‌కు సీటు కేటాయిస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశ్యంతోనే కొత్తవారి మధ్య కేటాయించినట్లుగా తెలుస్తోంది.
ఛలో అసెంబ్లీకి అనుమతివ్వండి
ఛలో అసెంబ్లీకి అనుమతివ్వాలని ముఖ్యమంత్రిని బిజెపి, తెరాస, సిపిఐ ఎమ్మెల్యేలు కోరారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. టిడిపి తెలంగాణకు అనుకూలమని చెపితే ఆ పార్టీతో కలిసి పని చేస్తామని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు.












Click it and Unblock the Notifications