లౌకిక ముద్ర: 8 ఏళ్లలో మూడోసారి అద్వానీ రాజీనామా

2005 జూన్ 7వ తేదిన తొలిసారి ఆయన పార్టీ అధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు. అంతకుముందు ఆయన పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు. ఆరు రోజుల పాటు అక్కడ పర్యటించిన అద్వానీ అక్కడకు వెళ్లినప్పుడు పాకిస్తాన్ స్థాపకుడు మహ్మద్ అలీ జన్నాను లౌకికవాదిగా అభివర్ణించారు.
దీంతో అద్వానీ పైన ఆర్ఎస్ఎస్, హిందుత్వవాదులు మండిపడ్డారు. ఆయనపై ఎదురుదాడికి దిగారు. జిన్నాను పొగడటం ద్వారా తనపైన పడిన అతివాద ముద్రను తొలగించుకొని, ఎక్కువ మంది ఓటర్లకు ఆమోదయోగ్యుడిగా మారడానికి వీలుగా మితవాది అనిపించుకునే ప్రయత్నంలో ఆయన పర్యటన ఉపయోగించుకున్నారనే భావన అందరిలో కలిగింది.
కానీ ఆయనకు అది ఎదురు దెబ్బ తగిలింది. ఆయన రాజీనామా చేశారు. నాలుగు రోజుల చర్చోపచర్చల అనంతరం ఆయన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. అయితే ఆర్ఎస్ఎస్, అద్వానీ మధ్య అంతరం అలాగే ఉండిపోయింది. ఇదే అంశంపై అద్వానీ మళ్లీ 2005 డిసెంబర్ 31 పార్టీ అధ్యక్షుడిగా మరోసారి రాజీనామా చేశారు. ఇప్పుడు మూడోసారి పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications