పార్కులో ముగ్గురు భక్తురాళ్లతో దిగంబర బాబా హల్‌చల్

కొద్దిసేపు ద్విచక్ర వాహనంపై కూర్చొని ఫోజులిచ్చాడు. భక్తులను కూర్చోబెట్టి నగ్నంగా పూజలు చేశాడు. ఊయల ఊగాడు, అక్కడే పూజలు చేసేందుకు స్వామి దిగంబరంగానే భక్తులతో కలిసి ప్రారంభించగా.. పోలీసులు ఆయనను హెచ్చరించారు. పరదా కట్టుకొని పూజలు చేసుకోవాలని సూచించారు.
బాబా దిగంబరంగా ఉండటంతో అక్కడున్న వారు ఇబ్బందులు పడ్డారు. మహిళా సంఘాలు బాబా తీరు పైన మండిపడ్డాయి. బాబా విషయం తెలిసి.. జనాలు, మీడియా వస్తుండటంతో అతను అక్కడి నుండి జారుకున్నారు. ఇతను ప్రకాశం జిల్లాకు చెందిన బాబాగా తెలుస్తోంది.
అతను గతంలో టీచర్‌గా పని చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి అజ్ఞాతంలోకి వెళ్లాడు. తర్వాత బాబాగా ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షమయ్యాడు. భక్తులు ఇచ్చిన విరాళాలలో ఆశ్రమం నిర్మించాడు. 1982లో మౌన వ్రతం చేపట్టిన ఈ బాబా.. 1994 నుండి వస్త్ర సన్యాసం చేసి కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications