నా భార్యను లోబర్చుకుంది: మహిళపై ఒకరి ఫిర్యాదు

సదరు మహిళా కానిస్టేబుల్ తన మామగారి ఇంటికి సమీపంలోనే ఉంటోందని.. అక్కడ తన భార్యతో పరిచయం పెంచుకుని తనకు కాకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను వదిలిపెట్టాలని ప్రాధేయపడ్డా కనికరించకపోగా.. తనను చితకబాదినట్టు చెప్పారు. తన భార్యను ఆమె బారి నుంచి కాపాడి తనకు ఇప్పించాల్సిందిగా వేడుకున్నారు.
మహిళ ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా పూడురు మండలంలోని సోమనగుర్తి గ్రామ శివారులో ఓ వింతు మహిళ నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
యువతి ఆత్మహత్య
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కావడం లేదని మనోవేధనకు గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాదులోని జీడిమెట్లలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాకు ఓ యువతి భర్తతో మనస్పర్థలు రావడంతో కూతురుతో కలిసి హైదరాబాద్ వచ్చింది.
కూతురు ఓ కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన మేనత్త కొడుకును ప్రేమించింది. అయితే అతడికి వేరే యువతితో పెళ్లి నిశ్చయం కావడంతో.. అతను తనకు దక్కకుండా పోతున్నాడని మనస్థాపం చెంది మంగళవారం ఉదయం తల్లి బయటకు వెళ్లాక ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది.












Click it and Unblock the Notifications