నేనింతే: సంతకాల సేకరణపై లొంగేది లేదన్న మహీధర్

వారి సొంత పనులు చేయలేదనే సంతకాల సేకరణ చేపట్టారన్నారు. దాంతో తనకు ఇబ్బంది లేదన్నారు. మరోవైపు ఆయనకు కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అండగా నిలబడ్డారు. మహీధర్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేపట్టడం సరికాదన్నారు.
పిఏసి చైర్మన్‌గా కృష్ణమూర్తి
పిఏసి చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కెఈ కృష్ణమూర్తిని నియమిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సభాపతికి శుక్రవారం లేఖ రాశారు. అమెరికాలో ఉన్న చంద్రబాబు లేఖను రాశారు.
పిఏసి చైర్మన్ విషయమై రేవూరి ప్రకాశ్ రెడ్డి, కెఈ కృష్ణమూర్తి మధ్య గతేడాది ఒప్పందం జరిగింది. ఏడాది రేవూరి, మరో ఏడాది కెఈకి అప్పగించేవిధంగా నిర్ణయించారు. చంద్రబాబు రాసిన లేఖను తెలుగుదేశం పార్టీ నేతలు సభాపతికి ఈ రోజు ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications