కిడ్నాప్‌కు గురైన మూడేళ్ల బాలుడి దారుణ హత్య

3 year old boy kidnapped and murdered
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో సోమవారం ఉదయం కిడ్నాప్‌కు గురైన చిన్నారి హర్షిత్ రెడ్డి మంగళవారం విగతజీవుడుగా కనిపించాడు. మూడేళ్ల హర్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు రూ.7 లక్షల రూపాయల కోసం డిమాండ్ చేశారు. ఏడు లక్షల రూపాయలు ఇవ్వకుంటే బాలుడిని చంపేస్తామని వారు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఓబులక్కపల్లె శివారులో బాలుడి శవం పాతిపెట్టి ఉంది. నిందితులు బాలుడిని గొంతు నులిమి హతమార్చారు. హర్షిత్ రెడ్డి కిడ్నాప్ తర్వాత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలుడి కోసం గాలించారు. ఈ రోజు ఆ చిన్నారి శవమై కనిపించాడు.

హర్షిత్ రెడ్డి కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు ఇచ్చేంత ఆర్థిక పరిస్థితి లేదు. ఈ విషయం తెలిసి కిడ్నాపర్లు అంత మొత్తం డిమాండ్ చేయడంతో పోలీసులు కుట్ర కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు. అంతేకాకుండా కిడ్నాప్ చేసిన రోజునే చంపడం చూస్తుంటే కూడా కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ కిడ్నాప్ కేసులో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్లలో ద్వారకా తిరుమలకి చెందిన ఓ బస్సు మంగళవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+