వైయస్‌కు డబ్బులతో టికెట్: లగడపాటిపై పాల్వాయి

రాష్ట్ర ఏర్పాటుకు శానససభ తీర్మానం అవసరం లేదని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ కూడా ఉద్యమాన్ని అణచలేకపోయారని ఆయన అన్నారు. రాజీనామా చేస్తానని గుంటూరు పార్లమంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు చాలాసార్లు అన్నారని, చేశారా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రకు ప్యాకేజీ ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
నల్లగొండ జిల్లాలో తన రాజకీయ ప్రత్యర్థులైన శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలపై ఆయన మరోసారి ధ్వజమెత్తారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ముంచిన డబ్బుతో కోమటిరెడ్డి బ్రదర్స్ కటౌట్లు పెట్టారని ఆయన ఆరోపించారు. తెలంగాణ సభకు వారు తెచ్చింది 400 మందిని మాత్రమేనని ఆయన అన్నారు. కాంగ్రెసులో విలీనమైతే తెరాసకే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ నేతలు నిర్వహించిన తెలంగాణ సాధన సభకు ఆహ్వానం అందకే తాను వెళ్లలేదని మంత్రి ముఖేష్‌గౌడ్ తెలిపారు. తెలంగాణపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవాలయంలో మంత్రి ముఖేష్ ప్రత్యేక పూజలు జరిపించారు.












Click it and Unblock the Notifications