20 ఏళ్లు జగన్ జైల్లోనే, అమ్మాకూతుళ్ల పోటీ: గాలి

తెలంగాణా చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిన ఘనత సోనియాదేనని ఆరోపించారు. బుధవారం రా త్రి స్థానిక రాజు కాంప్లెక్స్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పుంగనూరు ప్రజలు రెండు పర్యాయాలు తప్ప ప్రతిసారి తమ పార్టీని ఆదరించారని గుర్తు చేశారు. తన స్వగ్రామం చంద్రగిరి ప్రాంతంలో ఉన్నా అక్కడ గెలవడం తనకు సులభమైనా నగరిలో పోరాడి గెలిచానన్నారు.
రాజకీయాల్లో పారిపోతే లాభం లేదని పోరాడి సాధించాలన్నారు. రూ. 2 లక్షల కోట్లు ప్రజల సొమ్ము దోచుకున్న తల్లి కాంగ్రెస్‌ను, పిల్ల కాంగ్రెస్ అయిన వైసీపీని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అవినీతికి పాల్పడ్డ మంత్రులు, నేతలు 2014 నాటికి జైళ్లకు వెళ్లక తప్పదన్నారు.
స్థానిక ఎన్నికల కోసమే చంద్రబాబు నాయుడు ఈనెల 5న తిరుపతి ప్రాంతీయ సదస్సుకు వస్తున్నారని పార్టీశ్రేణులు భారీగా తరలి రావాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. అవినీతి కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరని, వచ్చేది తమ పార్టీ ప్రభుత్వమేనన్నారు.












Click it and Unblock the Notifications