వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బన్సల్‌ను వదిలేశారేం?: అంబటి, పార్టీ ప్లీనరీ వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: రైల్వే బోర్డు ముడుపుల కేసులో కేంద్ర మంత్రి పవన్ కుమార్ బన్సల్‌ను సిబిఐ చార్జిషీట్‌లో చేర్చకపోవడం ఆశ్చర్యంగా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం ఆక్షేపించారు. బన్సల్ కేంద్ర మంత్రిగా ఉండగా ఆయన మేనల్లుడు విజమ్ సింగ్లా పట్టుబడ్డాడనీ, బన్సలే ఆ వసూళ్లలో సింగ్లాను పనిముట్టుగా వాడుకున్నాడని ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు.

అలాంటిది బన్సల్‌ను సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో నిందితుడిగా కాకుండా 39వ సాక్షిగా పేర్కొని బన్సల్‌కు ఆ వ్యవహారంలో ప్రయేయం లేనట్టు చెప్పాడంలో ఆంతర్యమేమిటని సిబిఐని ప్రశ్నించారు. అదే సమయంలో తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి జైలులో పెట్టడమేమిటని ప్రశ్నించారు. బన్సల్‌కో న్యాయం, జగన్‌కో న్యాయమా అని ప్రశ్నించారు. ఏనాడు సచివాలయానికి జగన్‌ను అరెస్టు చేయడం దారుణమన్నారు.

ప్లీనరీ వాయిదా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీ సమావేశాన్ని పంచాయితీ ఎన్నికల దృష్ట్యా వాయిదా వేసినట్లు ఆ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మైసూరా రెడ్డి చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన కడప జిల్లా ఇడుపుల పాయలో ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది.

ప్లీనరీ సమావేశం తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ నాయకురాలు షర్మిల నిర్వహించే మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర యథావిధిగా జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ యాత్రలో ఎటువంటి మార్పు ఉండబోదన్నారు. వైయస్ జయంతి రోజున పెద్ద ఎత్తున రక్తదానం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

English summary
YSR Congress Party spokes person Ambati Rambabu has questioned Congress party about former Central Minister Pawan Kumar Bansa
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X