దూరంగా ఉంటావా?: కెసిఆర్‌కు అన్న కూతురు సవాల్

తెలంగాణ మాదిగ దండోరా నేత చింతా స్వామి ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద 'వెయ్యి డప్పులు- లక్ష చెప్పులు' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమ్య మాట్లాడారు. తెలంగాణ వస్తే దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెబుతున్న కెసిఆర్, ఇన్నేళ్లలో ఏ జిల్లాకు అయినా అధ్యక్షుడిని చేశారా అని ఘాటుగా ప్రశ్నించారు. సీమాంధ్రులు తరలించుకుపోయే దానిలో ఆయన వాటా ఎంతన్నారు.
కెసిఆర్ కుటుంబ సభ్యుల తీరును విమర్శిస్తే దాడులు చేస్తారా అన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమన్నారు. మహిళలు అంటే కెసిఆర్‌కు చిన్న చూపన్నారు. అందుకే తన ఫంక్షన్ హాలు పైన దాడి చేయించారని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని బజారుకీడుస్తానంటారన్నారు. మహిళ అని చూడకుండా సోనియాని అలా అనడం దేనికి నిదర్శనమన్నారు. ప్రధానమంత్రిని చప్రాసీతో పోల్చడమేమిటన్నారు.
తెరాస నేతల పైన వచ్చిన ఆరోపణలపై పెదవి ఎందుకు విప్పడం లేదన్నారు. తన ఆత్మగౌరవం దెబ్బతిన్నందునే తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానన్నారు. రాజకీయాల్లో ఎంతో అనుభవమున్న కెసిఆర్ చిన్న చిన్న వాటికే అసహనానికి గురైతే ఎలా అన్నారు. విమర్శలకు సమాధానం చెప్పకుండా దాడులు చేయడం ఏం సంస్కృతి అన్నారు. కెసిఆర్ వల్ల కేవలం దళితులకే కాకుండా దళితులకు అండగా ఉన్న దొరల బిడ్డకు కూడా అన్యాయం జరుగుతోందని చింతా స్వామి అన్నారు.












Click it and Unblock the Notifications