సమైక్యమనండి: రాయపాటి, 'రెడ్డి' కాదు నీటి రగడ: జెసి

Rayapati Sambasiva Rao
హైదరాబాద్: సమైక్యవాదం ప్రతిపాదించాలని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి చెప్పారు. క్యాంపు కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డిని పలువురు నేతలు కలుసుకున్నారు. రోడ్ మ్యాపులో సమైక్యాంధ్రకు అనుకూలంగా సూచనలు చేయాలని ఆయన కిరణ్‌ను కోరారు.

రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించడానికి వీల్లేదని రాయపాటి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. విభజనతో సాగునీరు, విద్యుత్ తదితర వివాదాలు తలెత్తుతాయని, రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు 80 శాతం ఆదాయం వస్తుందని, విభజన వల్ల దీనికి గండి పడుతుందని చెప్పారు. హైదరాబాద్, దాని చుట్టూ ఉన్న సీమాంధ్రులు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందన్నారు. కిరణ్ ఇచ్చే నివేదికలోనూ ఇవే అంశాలను పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు.

శాసన మండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు శనివారం సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డితో మాట్లాడారు. అప్పట్లో కమ్మ సామాజిక వర్గం తమ ఆధిపత్యం కోసం జై ఆంధ్ర ఉద్యమం చేపట్టిందని, ఇప్పుడు తెలంగాణలో రెడ్ల పెత్తనం కోసం రాయల తెలంగాణ అంటున్నారని ఆరోపించారు. దానికి జెసి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంతో కలిసి ఉంటే నీటి వివాదాలు ఉండవనేది తన అభిప్రాయమన్నారు.

రూట్ మ్యాప్‌లు పరిశీలించిన తర్వాతే తెలంగాణపై అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకొంటుందని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అన్నారు. శనివారం గుంటూరు జిల్లా రేపల్లెలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణపై మూడు రూట్‌మ్యాప్‌లను తీసుకురావాలని రాష్ట్రానికి సూచించిందన్నారు. వాటిని పరిశీలించిన తర్వాతే అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్య పరిష్కారం వస్తుందని జెడి శీలం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+