టిఆర్ఎస్‌పై బాబు నిప్పులు, 'టి' ఉద్యమకారులకు హామీ

Chandrababu Naidu - K Chandrasekhar Rao
వరంగల్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వసూళ్ల పార్టీ అని, ఆ పార్టీ నాయకులు ఉద్యమం పేరుతో టిక్కెట్లు అమ్ముకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఆదివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లతో గెలుస్తుందని, కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమని అన్నారు.

పంచాయతీ ఎన్నికలలో పసుపు జెండా ఎగురవేయాలన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింటుమెంట్ కోసం ఐదు రోజులు పడిగాపులు కాసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తరాఖండ్ బాధితుల కోసం ఒక్కరోజును కేటాయించలేదన్నారు. తమ మహాలక్ష్మి పథకాన్నే బంగారుతల్లిగా మార్చారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు.

విద్యార్థుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగమిస్తామన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల పైన ఉన్న కేసులను ఎత్తివేస్తామన్నారు. రేపు, ఎల్లుండో పిల్ల కాంగ్రెసు తల్లి కాంగ్రెసులో కలువడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వసూళ్ల పార్టీ అని, ఆ పార్టీకి సాధారణ ఎన్నికలలో గెలిచే సత్తా లేదన్నారు. తెరాస నాయకులు ఉద్యమం పేరుతో టిక్కెట్లు అమ్ముకుంటున్నారన్నారు. టిఆర్ఎస్ నేతల పైన ఎవరైనా ఆరోపణలు చేస్తే వారిపై దాడులు చేస్తారని, ఇదేం సంస్కృతి అని ప్రశ్నించారు.

అధికారంలోకి రాగానే తెలంగాణ: బిజెపి

తాము అధికారంలోకి రాగానే తెలంగాణ ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాదులో జరుగుతున్న ప్రజా చైతన్య సదస్సులో వెంకయ్య నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. బిజెపి హయాంలోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

కాంగ్రెసు హయాంలో అన్నీ స్కాములేనన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేరు వింటేనే కాంగ్రెసు పార్టీ భయపడుతోందన్నారు. మతపరమైన బిల్లు రద్దు చేస్తామన్నారు. తప్పుడు కేసులు బనాయిస్తోందన్నారు. ప్రస్తుత అందరి దృష్టి మోడీ పేనే ఉందని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందిందన్నారు. కాగా సదస్సులో తనను మాట్లాడించకపోవడంపై అలక వహించిన దత్తాత్రేయ మధ్యలో వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+