మళ్లీ అయోధ్య!, నితీష్‌కు గుణపాఠం తప్పదని మోడీ

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రచార ప్యానెల్‌లోని అమిత్ షా శనివారం అయోధ్యలో ప్రత్యేక పూజలు చేశారు. అమిత్ మోడీకి సన్నిహితుడు కూడా. అమిత్ ఉత్తర ప్రదేశ్ వ్యవహారాల బాధ్యుడిగా నియమితులయ్యారు. అమిత్ పూజలు చేయడం ద్వారా బిజెపి మరోసారి హిందుత్వాన్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైందని అర్థమవుతున్నట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
పూజలు చేసిన అమిత్ మాట్లాడుతూ.. ప్రపచంలోని కోట్లాది హిందువుల నమ్మకానికి కేంద్రమైన రామ మందిరాన్ని సందర్శించడానికి వచ్చానని, అయోధ్య రాముడిని పింజించిన తర్వాత దేశంలో సుపరిపాలన ఏర్పడాలని, కాంగ్రెసు పాలన నుంచి జాతి విముక్తం కావాలని ప్రార్థించానని, వీలైనంత త్వరలో ఇక్కడ భవ్యమైన రామ మందిరం నిర్మించి, రాముడి జన్మస్థలమైన ఇక్కడ రాముడ్ని ప్రతిష్టించాలని కోరుకుంటున్నానని చెప్పారు.
వ్యూహాత్మకంగా బిజెపి అడుగులు
బిజెపి జాతీయవాదం, హిందుత్వవాదం, దక్షిణాధిలో అభివృద్ధి, ఉత్తరాదిలో ఆయోధ్య, భారీ సభలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం.. ఇలా అధికారం కోసం అడుగులు వేస్తోంది.
నితీశ్‌కు గుణపాఠం నేర్పుదాం: మోదీ
బిజెపికి ద్రోహం చేసిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై పరోక్ష విమర్శలు గుప్పిస్తూ ద్రోహులకు గుణపాఠం నేర్పుదామంటూ పిలుపు నిచ్చారు. 1500 మంది కార్యకర్తలనుద్దేశిస్తూ టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆయన సందేశమిచ్చారు. '1974 నాటి కాంగ్రెస్ వ్యతిరేకత ఇప్పుడు దేశంలో కనిపిస్తోంది. బీహార్ ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టారు. అప్పట్లాగానే (1974) ద్రోహం తలపెట్టిన వారికి బీహార్‌లో తగిన గుణపాఠం చెప్ప డం ఖాయం' అన్నారు.












Click it and Unblock the Notifications