హైద్రాబాదులో సమైక్య సభ: గంటా, పెట్టుకోవచ్చని దానం

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము అధిష్టానం పెద్దలను కోరుతామన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను కలిసి సమైక్యాంధ్రకు అనుకూలంగా రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరుతామన్నారు. దామోదర తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి కాదని, ఆంధ్ర ప్రదేశ్‌కు అన్నారు. ఆయనకు విజ్ఞప్తి చేసే హక్కు తమకుందన్నారు.
ఎవరైనా పెట్టుకోవచ్చు: దానం
హైదరాబాదులో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చునని మంత్రి దానం నాగేందర్ అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉందని, ఇలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన వారెవరైనా సభలు నిర్వహించుకోవచ్చునన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శవ రాజకీయాలు మానుకోవాలని మండిపడ్డారు.
బాబు మానవత్వం గురించి తెలుసు: రుద్రరాజు
బాబు మానవత్వం గురించి అందరికీ తెలుసునని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత రుద్రరాజు పద్మరాజు ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలనేదే ఆయన ఉద్దేశ్యమన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్నారు. తాము సమైక్య సభలు పెడతామన్నారు. లేదంటే చైతన్యం లేదనుకునే అవకాశముందన్నారు. విభజనపై తమలో ఎలాంటి అయోమయం లేదన్నారు. అందరం సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications