నా నియోజకవర్గమేనా: జయసుధ, చిరు వినతి

Jayasudha
హైదరాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గం అనేసరికి తన ఒక్క నియోజకవర్గమేనని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారని కాంగ్రెసు సికింద్రాబాద్ శానససభ్యురాలు, సినీ నటి జయసుధ అన్నారు. సికింద్రాబాద్‌లోని సిటీ లైట్ హోటల్ భవనం కూలిన సంఘటనపై ఆమె సోమవారం ప్రతిస్పందించారు. అటు కంటోన్మెంట్, ఇటు సనత్‌నగర్ నియోజకవర్గాలున్నాయని, సికింద్రాబాద్ ప్రాంతంలో ఏది జరిగినా తన నియోజకవర్గమేనని అంటే ఎలా అని ఆమె అన్నారు.

సోమవారం ఆమె కాంగ్రెసు శాసనసభా పక్ష కార్యాలయానికి వచ్చారు. తన నియోజకవర్గం అయినా కాకపోయినా దుర్ఘటనలు జరిగినప్పుడు ఒక మనిషిగా తాను స్పందిస్తానని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. హోటల్ కూలిందని తెలియగానే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శిశిధర్ రెడ్డితో తాను మాట్లాడినట్లు ఆమె తెలిపారు.

సికింద్రాబాద్‌లో సిటీ లైట్ హోటల్ కూలిన ఘటనలో మరణించినవారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని కేంద్ర మంత్రి చిరంజీవి కోరారు. సిటీ హోటల్ కూలిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ముఖ్యమంత్రిని కోరారు. శిథిలావస్థకు చేరిన భవనాల విషయంలో అధికారులు అసత్వం ప్రదర్శించకూడదని ఆయన అన్నారు.

సిటీ లైట్ హోటల్ కూలిపోవడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. శిథిలావస్థకు చేరిన భవనాలను ఎప్పటికప్పుడు పరిశీలించి కూల్చి వేయిస్తే ఇటువంటి పరిస్థితి ఎదురు కాదని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలేసి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+