మాజీ ఎంపి బాబూరావుకు మూడు నెలలు జైలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆపాలంటూ సిపిఎం, గిరిజన సంఘం, దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో 2007 జనవరి 29న భద్రాచలం సబ్‌కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అయితే భద్రాచలంలో అప్పటికే 144వ సెక్షన్ విధించారు.
కానీ మాజీ ఎంపీ మిడియం, భద్రాచలం జడ్పీటీసీ మాజీ సభ్యుడు గుండు శరత్, సోడే పంతులు, పి.సంతోష్ దాన్ని అతిక్రమించి, గోడలు దూకి సబ్‌కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అప్పట్లో కేసు నమోదైంది.
ఈ కేసుపై ఇరుపక్షాల వాదనలు విన్న భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కె.శ్రీనివాసరావు - బాబూరావు సహా నలుగురికి మూడు నెలల జైలుశిక్ష, రూ. 700 చొప్పున జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. ఆ రోజు భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్‌లవో నాయకులు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశంతో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అది కాల్పులకు దారి తీసింది.












Click it and Unblock the Notifications