కీచకపర్వం: మహిళపై నలుగురు గ్యాంగ్ రేప్

గ్రామానికి చెందిన 28 ఏళ్ల ఓ వివాహిత మహిళ పోలం పనులకు వెళ్లింది. అక్కడ ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన అదే గ్రామానికి చెందన సద్దాం, గౌస్, ఏసప్ప, సాయిలు ఆమె నోట్లో గుడ్డలు కుక్కి సామూహిక అత్యాచారానికి పాల్పపడ్డారు. పరువు పోతుందని బాధితురాలు ఆ విషయం ఎవరికీ చెప్పలేదు.
రెండు రోజుల క్రితం ఆమె తిరిగి పొలానికి వెళ్లినప్పుడు అదే నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారు. వారి నుంచి ఆమె తప్పించుకుని పారిపోయి ఇంటికి చేరుకుంది. తాను మొదటి సంఘటన గురించి ఎవరికీ చెప్పకపోవడంతో అలుసుగా తీసుకుని రెండో సారి అఘాయిత్యానికి పాల్పడ్డారని గ్రహించిన మహిళ విషయాన్ని ఆదివారంనాడు భర్తకు చెప్పింది.
దాంతో బాధితురాలు భర్తతో కలిసి కంగ్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications