మామ మృతి: నిమ్మగడ్డకు బెయిల్, 6 నుండి 8 వరకు

Nimmagadda Prasad
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు నాంపల్లి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ప్రత్యేక కోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

నిమ్మగడ్డ మామ రాంప్రకాశ్ ఆర్య ఈ రోజు ఉదయం చనిపోయారు. ఆయన వయస్సు 89. ఆయన కర్మకాండ చేసేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు పదమూడు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిమ్మగడ్డ ఈ రోజు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తన మామ చనిపోయారని, ఆయన కర్మకాండ కోసం పదిహేను రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో కోరారు.

ఆయన పిటిషన్ స్వీకరించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే పదమూడు రోజులు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆయనకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. తిరిగి సాయంత్రం ఆయన జైలుకు రావాల్సి ఉంటుంది. బయట ఉన్నప్పుడు ఆయన వెంట ముగ్గురు మఫ్టీ పోలీసులు ఉంటారు. రూ.25వేల పూచీకత్తును సమర్పించారు.

కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో వాన్‌పిక్ అంశం పైన నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయ్యారు. ఆయన చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. జగన్ ఆస్తుల కేసులో వైయస్ జగన్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు అరెస్టై జైలులో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+