జగన్‌పార్టీలో అసంతృప్తి: జనార్ధన్ స్థానంలో కూన శ్రీశైలం

జనార్ధన్ రెడ్డి స్థానంలో కుత్బుల్లాపూర్ శాసన సభ్యుడు కూన శ్రీశైలం గౌడ్‌ను నియమించింది. పార్టీలో మొదటి నుండి పని చేస్తున్న వారిని గుర్తించడం లేదని జనార్ధన్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారట. ఈ విషయాన్ని ఆయన పెద్దల దృష్టికి కూడా తీసుకు వెళ్లారట. ఫలితం కనిపించక పోవడంతో రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.
దీనిని గుర్తించిన అదిష్టానం ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఆయనను జిల్లా కన్వీనర్ పదవి నుంచి తప్పించి ఆన స్థానంలో శ్రీశైలం గౌడ్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. అసంతృప్తి నేపథ్యంలో ఈ మార్పు ఆకస్మికంగా జరిగిందంటున్నారు. అదే సమయంలో ఆయనను సిఈసిలోకి తీసుకున్నారు. సిఈసి పట్ల కూడా జనార్దన్ అంత సంతృప్తిగా లేరని అంటున్నారు.
కాగా జిల్లా కన్వీనర్‌గా తనకు కనీసం గుర్తింపునివ్వడం లేదని, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పని చేసిన వారికి ప్రోత్సాహం ఇవ్వడం లేదని, కనీస అవహాగన లేని, స్థాయిలోని వారినీ నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమించారని జనార్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.












Click it and Unblock the Notifications